PM phone to CM KCR and CM Jagan: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రధాని మోడీ ఫోన్!
PM phone to CM KCR and CM Jagan: దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో రాష్ట్రాలలోని తాజా పరిస్థితుల పైన ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదివారం ఫోన్ చేశారు
PM phone to CM KCR and CM Jagan: దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో రాష్ట్రాలలోని తాజా పరిస్థితుల పైన ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదివారం ఫోన్ చేశారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లకి ప్రధాని ఫోన్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా వైరస్ ని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి మొదలగు అంశాల పైన ప్రధాని మోడీ చర్చించారు. అంతేకాకుండా కరోనాని నివారణకి పలు సూచనలను సూచించారు. ఇక బీహార్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ముచ్చటించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కేంద్రం అండగా ఉంటుందని మోడీ భరోసా ఇచ్చారు.
ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 38,902 కేసులు నమోదు కాగా, 543 మంది ప్రాణాలు విడిచారు.తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10,77,618 కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,73,379 ఉండగా, 6,77,423 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 26,816 మంది కరోనా వ్యాధితో మరణించారు. గురువారం దేశవ్యాప్తంగా 358127 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 13791869 కరోనా టెస్ట్‌లు చేసినట్లు వెల్లడించింది. ఇక రికవరీ రేటు పెరుగుతుండడం సంతోషతగ్గ విషయం!