Kamareddy: ఏసీబీ అధికారుల పేరిట ఫోన్లు.. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్

Kamareddy: కాల్‌ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు

Update: 2023-07-04 04:06 GMT

Kamareddy: ఏసీబీ అధికారుల పేరిట ఫోన్లు.. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారుల పేరిట ఫోన్లు కలకలం సృష్టించాయి. వివిధ శాఖలకు చెందిన ఆరుగురు జిల్లా అధికారులకు ఏసీబీ అధికార్లమంటు ఫోన్లు చేసి లక్షల్లో డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వని యెడల మీ బాగోతం బయటపెడతామంటూ ఫోన్ లో బెదిరింపులకు పాల్పడ్డారు. మూడు నుంచి ఐదు లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆరుగురు అధికారులు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డిని ఆశ్రయించారు. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సైబర్ నేరగాళ్లు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. కాగా నెంబర్ ను కర్ణాటకకు చెందిన ఫోన్ నెంబర్ గా పోలీసులు గుర్తించారు. 

Tags:    

Similar News