హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. ‘హైడ్రా’ ప్రతివాదిగా కోర్టులో పిటిషన్‌..

Telangana High Court: వినాయక నిమజ్జనంపై మరోసారి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ కోరారు.

Update: 2024-09-09 11:57 GMT

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. ‘హైడ్రా’ ప్రతివాదిగా కోర్టులో పిటిషన్‌..

Telangana High Court: వినాయక నిమజ్జనంపై మరోసారి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ కోరారు. దీనికి హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని హైకోర్ట్‌కు దాఖలు చేసిన పిటిషన్‌లో పిటిషనర్ పేర్కొన్నారు.

చెరువులను హుస్సేన్‌సాగర్‌ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోర్టును పిటిషనర్‌ కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై వాదనలను రేపు(మంగళవారం) వింటామని న్యాయస్థానం తెలిపింది. తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌లో రేపు వాదనలు జరుగనున్నాయి. 

Tags:    

Similar News