Revanth Reddy: కోకా పేట్ వేలంలో పాల్గొన్నది సీఎం బీనామీ సంస్థలే

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలంలో గోల్ మాల్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Update: 2021-07-17 14:27 GMT

రేవంత్ రెడ్డి(ఫైల్ ఇమేజ్ )

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలంలో గోల్ మాల్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూముల వేలం టెండర్లలో సీఎం కేసీఆర్ బీనామీ కంపెనీలే పాల్గొని కొనుగోలు చేశాయని అన్నారు. మైహోం రామేశ్వర్ రావు కంపెనీ ఈ భూములు కొనుగోలు చేశారని స్వయంగా రామేశ్వర్ రావు ఇద్దరు కుమారుల కంపెనీలు కొనుగోలు చేశాయన్నారు. వీరితో పాటు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బినామీ కంపెనీ కొనుగోలు చేశారన్నారు. దేశంలోని ప్రధాన కంపెనీలను టెండర్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. 60 కోట్ల కంటే తక్కువ అమ్ముడుపోయిన భూముల వేలం రద్దు చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News