తెలంగాణ భవన్‌లో పట్నం వర్సెస్‌ పైలట్‌ అనుచరుల మధ్య వాగ్వాదం

Telangana Bhavan: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో రగడ

Update: 2024-01-05 09:12 GMT

తెలంగాణ భవన్‌లో పట్నం వర్సెస్‌ పైలట్‌ అనుచరుల మధ్య వాగ్వాదం

Telangana Bhavan: తాండూరు బీఆర్ఎస్‌ వర్గపోరు మరోసారి బయటపడింది. తెలంగాణ భవన్ వేదికగా పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించగా.. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు. పైలెట్‌ రోహిత్ రెడ్డిని వేదికపై నుంచి దించాలని పట్టుబట్టారు. ఈ రగడలోనే ఎన్నికల వివాదాన్ని కూడా తీసుకొచ్చారు పైలెట్‌ రోహిత్ రెడ్డి వర్గీయులు. పట్నం మహేందర్ రెడ్డి వర్గం తమకు సహకరించలేదని ఆరోపించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

లంచ్ బ్రేక్‌తో వివాదానికి బ్రేక్ పడగా.. వెంటనే హరీష్ రావు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పైలెట్ రోహిత్‌ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బహిరంగంగా గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు.

Tags:    

Similar News