యాదాద్రిలో పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
Yadadri: పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత.
Yadadri: యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు కల్యాణమహోత్సవం నిర్వహించారు. అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే గొంగిడి సునీత పట్టువస్త్రాలు సమర్పించారు.