నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి మహిళల పాలాభిషేకం
MLC Kavitha: వితను కలిసిన జాగృతి మహిళా నేతలు, విద్యార్ధినులు
MLC Kavitha: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్షాలలో కదలిక తెచ్చిన ఎమ్మెల్సీ కవితకు విద్యార్థినులు, జాగృతి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్‌లో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
నిజామాబాద్‌లో కవిత క్యాంపు కార్యాలయం వరకు జాగృతి మహిళా నేతలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడూ ముందు ఉంటారని చెప్పారు. కవితకు జేజేలు పలికారు. ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న కవితకు ధన్యవాదాలు తెలిపారు జాగృతి నేతలు. కవిత పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత గురించి మొదటి నుంచి పోరాడుతోంది కవితేనన్నారు. కేంద్రం ఈ బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు సిద్ధపడటం..యావత్ మహిళా లోకం విజయంగా జాగృతి మహిళా నేతలు అభివర్ణించారు.