Padi Koushik Reddy: పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్..కేసు నమోదు చేసిన పోలీసులు
Koushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వివాదంలో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Koushik Reddy: తెలంగాణలో హైటెన్షన్ రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వివాదంలో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులను అడ్డుకున్నందుకు ఈకేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
గాంధీ తనను చంపాలనే తన ఇంటిమీదికి దాడికి వచ్చారని కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గాంధీ అలా వస్తుంటే పోలీసులే అతనికి ఎస్కార్ట్ ఇచ్చారంటూ మండిపడ్డారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ చేయించారని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తమపై దాడులు చేస్తుంటూ చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా ఎగిరేంతవరకు పోరాడుతూనే ఉంటామని కౌశిక్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో ఉద్యమానికి తెరలేపిందని...వారు షురూ చేస్తే తాము ముగిస్తామన్నారు.
ఇక తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని..ఏం తప్పు చేశానో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తనపై దాడి చేసి...తన నోరే మూయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరికపూడి గాంధీ మీద తమ ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మా పార్టీ పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న రాక్షస పాలనపై పోరాడుతూనే ఉంటామన్నారు. పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కౌశిక్ రెడ్డి అన్నారు.