నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని మామిడి పల్లి చౌరస్తాలో రైతుల మహా ధర్నా చేపట్టారు. వరి సన్న రకానికి క్వింటాకు 25వందల రూపాయలు చెల్లించాలనే డిమాండ్ తో ధర్నాకు దిగారు. రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ధర్నాకు రైతులు భారీగా తరలివచ్చారు. మద్దతు ధర కల్పించే విషయంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న రకం వరి పంటను సాగు చేయమని ప్రభుత్వమే సూచించిందన్నారు. పంటకు తెగుళ్లు రావడంతో సరైన దిగుబడి రాలేదని.. ఇలాంటి తరుణంలో మద్దతు ధరతో పాటు బోనస్ కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పసుపుకు మద్దతు ధర కల్పించే విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.