మెదక్ జిల్లా నార్సింగి వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం సన్నరకం వరికి మద్ధతు ధర 2వేల 5వందల రూపాయలు ప్రకటించాలని నేషనల్ హైవేపై బైఠాయించారు. దీంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది.
కేసీఆర్ ప్రభుత్వం మాట మేరకు సన్నరకం పంట వేసుకున్నామని అయితే సన్నవరికి చీడపీడలు పట్టి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1880 రూపాయలు మద్ధతు ధర ప్రకటించి రైతులను నిండా ముంచారని మండిపడుతున్నారు.
వెంటనే ప్రభుత్వం సన్నవరికి మద్ధతు ధర ప్రకటించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.