ఫారెస్ట్ అధికారుల ఓవరాక్షన్.. పాకాల సందర్శనకు వెళితే..
* అ కారణంగా నలుగురు విద్యార్థులను చితకబాదిన అధికారి
Mahabubabad: అటవీ శాఖ అధికారుల అరాచకానికి నలుగురు విద్యార్థులు బలిపశువులయ్యారు. ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన వారిని.. విచక్షణా రహితంగా చితకబాది.. చిత్రహింసలకు గురిచేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామానికి చెందిన విద్యార్థులు పాకాల పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు చిలుకల గుట్టపైకి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్.. విద్యార్థులను పట్టుకున్నాడు. విశ్రాంతి భవనం వద్ద నీళ్ల ట్యాంకును కూల్చేశారని ఆరోపిస్తూ వారిని చితకబాదారు. అక్కడి నుంచి కొత్తగూడ అటవీ క్షేత్ర కార్యాలయానికి తరలించి రాత్రంతా చలిలోనే కూర్చోబెట్టారు. బైకులు కూడా లాక్కోవడంతో ఇంటికి వెళ్లలేక అక్కడే ఉండిపోయారు.