Operation Chirutha: ఆపరేషన్‌ చిరుత సక్సెస్‌.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత

Operation Chirutha Success: ఎరగా వేసిన మేక కోసం వచ్చి బోనులో చిక్కిన చిరుత

Update: 2024-05-03 04:09 GMT

Operation Chirutha Success: ఆపరేషన్‌ చిరుత సక్సెస్‌.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత

Operation Chirutha Success: ఆపరేషన్‌ చిరుత సక్సెస్‌ అయింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద తీవ్ర కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. నాలుగు రోజుల క్రితం ఎయిర్ పోర్టు రన్ వే పై చిరుత కనిపించడంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు.. ఫారెస్ట్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో అలర్టయిన అటవీశాఖ అధికారులు.. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచరించిన ప్రదేశాల్లో 25 సీసీ కెమెరాలతో పాటు 5 బోన్లను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి చిరుతకు ఎరగా బోనులో మేకను ఉంచారు. మేకను తినేందుకు వచ్చిన చిరుత.. ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఐదురోజుల తర్వాత చిరుత చిక్కడంతో అటవీశాఖ అధికారుల కృషి ఫలించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News