Darbhanga Blast: దర్భంగా పేలుళ్ల కేసులో కొనసాగుతోన్న విచారణ

Darbhanga Blast: ఇవాళ్టితో ముగియనున్న నిందితుల కస్టడీ * వారం రోజుల పాటు విచారణ జరిపిన ఎన్‌ఐఏ

Update: 2021-07-09 05:46 GMT

విచారణ కొనసాగిస్తున్న ఎన్ఐఎ అధికారులు (ఫైల్ ఇమేజ్)

Darbhanga Blast: దర్భంగా పేలుళ్ల కేసులో నిందితులకు ఇవాళ్టితో కస్టడీ ముగియనుంది. బ్లాస్ట్ కేసులో అరెస్ట్ చేసిన మాలిక్ సోదరులను వారం రోజుల పాటు విచారించిన ఎన్‌ఐఏ అధికారులు.. కీలక ఆధారాలు సేకరించారు. నేడు వైద్య పరీక్షల అనంతరం పాట్నా కోర్టులో నిందితులను ప్రవేశపెట్టనున్నారు.

వారం రోజుల కస్టడీలో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో విచారణ జరిపారు ఎన్‌ఐఏ అధికారులు. సీన్ రీకన్‌స్ట్రక్ట్‌ చేసి.. పేలుడుకు వాడిన మెటీరియల్ ఎక్కడ కొన్నారు.. ఎవరు సహకరించారనే విషయాలను ఆరా తీశారు. ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్‌‌లకు తీవ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై ఆధారాలు సేకరించారు. 

Tags:    

Similar News