Cabinet Meeting: కొనసాగుతోన్న తెలంగాణ కేబినెట్ సమావేశం

Cabinet Meeting: ఉద్యోగ ఖాళీల భర్తీ, దళిత బంధు, కరోనాపై చర్చ * కరోనా పరిస్థితులపై చర్చిస్తోన్న మంత్రివర్గం

Update: 2021-08-01 11:01 GMT
సీఎం కెసిఆర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Cabinet Meeting: ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఉద్యోగ ఖాళీల భర్తీ, దళిత బంధుపై ప్రధానంగా చర్చిస్తోంది కేబినెట్. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు చెందిన అధికారులు వివరాలు అందించారు. ఆ తర్వాత అధికంగా కేసులున్న జిల్లాల్లో ఆక్సిజన్, మెడిసిన్, బెడ్ల లభ్యతపై కేబినెట్ చర్చించింది.

ఇక అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని బెడ్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కేబినెట్ ఆదేశించింది. కొత్తగా మంజూరు చేసిన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడంపై చర్చించిన కేబినెట్ కాలేజీల ఏర్పాట్ల కోసం కావాల్సిన నిర్మాణాలను చేపట్టాలని, వసతులను సత్వరమే ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను ఆదేశించింది. భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కొరకు స్థలాన్వేషణ, సౌకర్యాల రూపకల్పనకు ముందస్తు చర్యలను ప్రారంభించాలని వైద్యాధికారులను మంత్రివర్గం ఆదేశించింది. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలంది.

Full View


Tags:    

Similar News