ఈనెల 24న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించే అంశంతోపాటు, అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై చర్చించడానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
విభజన సమస్యలపై చర్చించేందుకు మరోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో ఇరువురు భేటీ కానున్నారు. గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించే అంశంతోపాటు, అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై చర్చించడానికి సిఎం కేసీఆర్, ఏపీ సిఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. గతంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా, ఇంజినీర్లు రూపొందించిన ప్రతిపాదనలపై చర్చించి ఒక నిర్ణయానికి రావాలని భావించిన నేపథ్యంలో తాజా సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి నీటి తరలింపుపై ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు సమావేశమై ప్రతిపాదనలు తయారుచేయాలని కేసీఆర్, జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే.