Anganwadi: మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి అక్రమదందా

* పిల్లలు, గర్భిణిలు, బాలింతలకు అందని పౌష్టిక ఆహారం * అంగన్‌వాడీ సెంటర్లను పక్కదారి పట్టిస్తున్న అధికారులు

Update: 2021-11-13 03:41 GMT

పిల్లలు, గర్భిణిలు, బాలింతలకు అందని పౌష్టిక ఆహారం(ట్విట్టర్ ఫోటో)

Anganwadi: మంచిర్యాల జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన గుడ్లు, పౌష్టిక ఆహార పదార్థాలు పక్కదారిపడుతున్నాయి. కొంతమంది అంగన్‌ వాడీ టీచర్లు వారిపైన ఉండే అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మార్కెట్‌లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. 969 అంగన్‌వాడీ సెంటర్లకు పాలు, గుడ్లు సరాఫరా అవుతున్న క్రమంలోనే వాటిని మార్గమధ్యంలో పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరికొన్ని చోట్ల అంగన్‌వాడీ టీచర్లకు తెలియకుండానే వారి సెంటర్లకు సంబంధించిన పాలు, గుడ్లు విక్రయాలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరిని నస్పూర్‌ పోలీసులు పట్టుకున్నారు.

నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో విస్తూపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ దందాలో ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు కూడా గుర్తించారు. పలువురు వ్యాపారులతో ముడుపులు తీసుకుంటూ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

ఇప్పటికైనా అధికారులు మేల్కొని పక్కదారి పడుతున్న లక్షలాది రూపాయల పాలు, గుడ్లు, సరుకులను కాపాడి బాలింతలకు, చిన్నపిల్లలకు సక్రమంగా అందే విధంగా చూడాలని, అదేవిధంగా అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News