Notification for Tribal Gurukuls: నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
Notification for Tribal Gurukuls: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపింది.
Notification for Tribal Gurukuls: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపింది. గిరిజన గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నిర్ణయించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫోర్త్ గ్రేడ్ పోస్టులు 58 వరకు ఉన్నాయని పేర్కొంది. అందులో భాగంగానే గిరిజన గురుకులాల్లో బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి గిరిజన గురుకుల సొసైటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు, ఉత్సాహవంతులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.50 ఫీజు చెల్లించాలని, మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఇక ఈ పోస్టులను భర్తీకి సంబంధించిన అంతిమ నిర్ణయం సొసైటీ కార్యదర్శిదే అని ప్రకటించింది. పోస్టులను దరఖాస్తు చేసేందుకు ఈనెల 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. సందేహాలు ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలకు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.
ఇక పోతే రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించడంతో పాఠశాలలన్నీ ఇప్పటి వరకు మూతపడే ఉన్నాయి. దీంతో విద్యార్థులందరూ గత ఆరు నెలలుగా ఇండ్లకే పరిమితమయి పాఠశాలలు ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం అగస్టు నెలలో పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ అది ఎంత వరకు సాధ్య పడుతుందో చూడాల్సిందే. ఇక అగస్టు నెలలో కూడా పాఠశాలలు ప్రారంభం కాకపోతే విద్యార్ధులు పరిస్థితి ఏంటనేది ఊహించకుండా ఉంది.