గ్రేటర్ హైదరాబాద్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపునకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది

Update: 2020-11-18 06:40 GMT

గ్రేటర్ హైదరాబాద్‌లో నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. రిటర్నింగ్‌ కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపునకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం. ఇక నిన్న ఒక్కరోజే నాలుగు వేలకు పైగా ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగించారు.

నిన్న గ్రేటర్ ఎన్నికలకి షెడ్యుల్ కి సంబంధించిన షెడ్యుల్ వచ్చేసింది. డిసెంబర్ 01న ఎన్నికల పోలింగ్ జరుగనుండగా. 04 న కౌంటింగ్ జరగనుంది. ఉదయం 07 గంటల నుంచి సాయింత్రం 06 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ విషయాన్నీ ఎన్నికల కమిషినర్ పార్థసారథి నిన్న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలోనే జరగనున్నట్టుగా అయన వెల్లడించారు. అటు నవంబర్ 20 న నామినేషన్ల స్వీకరణకి చివరి తేది కానుంది.

Tags:    

Similar News