తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. LRS లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు జీవో విడుదల చేసింది. అయితే, కొత్త లేఅవుట్లకు మాత్రం LRS లేకుండా నో రిజిస్ట్రేషన్ అని తేల్చిచెప్పింది. ఇంతకుముందు చెల్లుబాటయ్యే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా ప్రస్తుత యజమాని కొనుగోలు చేసినట్లయితే ఓపెన్ ప్లాట్లు, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని జీవోలో ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు లైన్ క్లియరైంది. దాంతో, ప్రజలకు భారీ ఊరట లభించినట్లయ్యింది.