Ex MP Kavitha In Home Quarantine : స్వీయ నిర్బంధంలోకి మాజీ ఎంపీ కవిత

Update: 2020-07-24 04:30 GMT

నిజామాబాద్‌ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సెల్ఫ్ క్వారెంటైన్ లోనికి వెళ్లారు. కవిత వద్ద పనిచేసే డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ గా తేలడంతో వైద్యుల సూచనల మేరకు ఆమె హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. మందస్తు జాగ్రత్తలో భాగంగానే ఆమె కటుంబమంతా క్వారెంటైన్‌ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే.

మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గురువారం కొత్తగా 1,567 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 50,826కి చేరింది. ఇందులో 39,327 మంది కోలుకోగా 11,052 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనాతో గురువారం మరో 9 మంది మృతిచెందగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 447కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 13,367 శాంపిల్స్‌ పరిశీలించగా ఇప్పటివరకు మొత్తం 3,22,326 శాంపిల్స్‌ పరీక్షించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనా భాకు 8,058 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.

Tags:    

Similar News