ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నాంపల్లి బీజేపీ ఆఫీస్‌లో నిజామాబాద్ బీజేపీ కార్యకర్తల నిరసన..
Nampally: అర్వింద్ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆగ్రహం
Nampally: హైదరాబాద్ నాంపల్లి బీజేపీ ఆఫీస్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్వింద్ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని సొంత పార్టీ కార్యకర్తలకే ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఆందోళనకు చేపట్టారు.
బీజేపీ కార్యకర్తల ఆందోళనపై ఎంపీ అరవింద్ స్పందించారు. మండల అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదన్నారాయన. జిల్లా అధ్యక్షుడి నిర్ణయం మేరకే మండల అధ్యక్షుల నియామకాలు ఉంటాయని.. సంస్థాగత నిర్ణయాలను జిల్లా అధ్యక్షుడే తీసుకుంటారని తెలిపారు అరవింద్..