Nizamabad News Today: నిజామాబాద్ జిల్లాల్లోని ఆర్టీసీలో కరోనా గుబులు..

Nizamabad News Today: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా ఉధృతికి ఆర్టీసీ విలవిలాడుతోంది.

Update: 2021-04-26 06:35 GMT

Nizamabad: నిజామాబాద్ జిల్లాల్లోని ఆర్టీసీలో కరోనా గుబులు..

Nizamabad News Today: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా ఉధృతికి ఆర్టీసీ విలవిలాడుతోంది. ఆరు డిపోల పరిధిలో సుమారు 165 మంది సిబ్బందికి కరోనా సోకింది. కరోనాతో చికిత్స పొందుతూ సుమారు నలుగురు డ్రైవర్లు - కండక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ సిబ్బందిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు బస్సులకు శానిటైజ్ చేయడంతో పాటు ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ ప్రధాన బస్టాండ్‌లో కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేస్తూ వైరస్ బారిన పడిన వెంటనే సిబ్బందిని ఐసోలేషన్‌కు పంపిస్తున్నారు.

మహారాష్ట్రలో కరోనా కరాళా నృత్యం చేస్తున్నా అధికారులు అంతరాష్ట్ర బస్సు సర్వీసులను యథావిథిగా తిప్పుతున్నారు. ఫలితంగా ఆ రూట్ లో డ్యూటీలకు వెళ్తున్న చాలా మంది ఆర్టీసీ కార్మికులు ఈ పాటికే కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర రూట్ లో డ్యూటీ చేసేందుకు భయంతో వణికిపోతున్నారు కార్మికులు. మహారాష్ట్ర నుంచి వస్తున్న వారిలో యాబై శాతం మందికి కరోన పాజిటీవ్ గా నిర్దారణ అవుతుంది.

ఇటీవల ఆర్మూర్ బస్ డిపోలో 18 మంది డ్రైవర్లు., కండక్టర్ లకి కరోనా సోకింది. బాన్సువాడ డిపోలో వారం వ్యవధిలో 28 మంది డ్రైవర్, కండక్టర్, మెకానిక్ లు మహమ్మారి బారిన పడ్డారు. ఇలా ఉమ్మడి నిజామాబాద్ లోని అన్ని డిపోల్లో ఉన్న కార్మికులకు ఇదే భయం వెంటాడుతూ ఉంది.

ఆర్టీసీ సిబ్బందిలో కరోనా గుబులు పుట్టిస్తుంటే ప్రయాణికులు సైతం బస్సులు ఎక్కేందుకు జంకుతున్నారు. ఫలితంగా ఆర్టీసీ ఆదాయం సగానికి సగం పడిపోయింది. ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం 30 లక్షల లోపు వస్తోంది. నైట్ కర్ప్యూ బస్సుల రాకపోకలపై ప్రభావం చూపుతోంది. గ్రామాలకు నడిచే బస్సులు రాత్రి 8 గంటలకు డిపోలకు చేరుకుంటున్నాయి. జిల్లాలో 50 శాతం పల్లెలు స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తుండటం ఆర్టీసీకి శాపంలా మారింది.

Tags:    

Similar News