Nizam Daughter Dies: ఏడో నిజాం కుమార్తె బషీర్ ఉన్నీసా బేగం కన్నుమూత

Update: 2020-07-28 08:56 GMT
బషీర్ ఉన్నీసా బేగం ఫైల్ ఫోటో

Nizam Daughter Dies: ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంతానంలో ఇప్పటి వరకు బ్ర‌తికున్న ఏకైక వ్య‌క్తి, ఆయ‌న కుమార్తె బ‌షీరున్నిసా బేగం(93). అయితే ఆమె మంగళవారం ఉదయం అనారోగ్యం కార‌ణంగా తుదిశ్వాస విడిచారు. బషీరున్నీసా బేగం 1927లో జన్మించారు. కాగా ఆమెకు అలీ పాషాగా పేరొందిన‌ నావాబ్ కాసిం యార్ జంగ్‌తో నిఖా జ‌రిగింది. వారికి ఓ ర‌షీదున్నిసా బేగం అనే ఓ కుమార్తె ఉంది. ఇక అలీ పాషా 1998లో మ‌ర‌ణించారు. ప్రస్తతుం వారు పురాణీ హ‌వేలీలో నివ‌సిస్తున్నారు. ఇక ఏడో నిజాం కూతురు బ‌షీరున్నిసా బేగం మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. జోహార్ ప్రార్థ‌న‌ల అనంత‌రం అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఆమె భౌతిక‌కాయాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పిస్తున్నారు. పాత‌బ‌స్తీలోని ద‌ర్గా యాహియా పాషా స్మ‌శాన‌వాటిక‌లో అంత్య‌క్రియ‌లు జ‌ర‌నున్నాయి.

ఇక పోతే ఏడో ఉస్మాన్ ఆలీ ఖాన్ ఏప్రిల్ 6, 1886న హైదరాబాదులోని పురానీ హవేలీలో జన్మించాడు. ఫిబ్రవరి 24, 1967న తుది శ్వాస విడిచారు. ఆయన మహబూబ్ ఆలీ ఖాన్ రెండవ కుమారుడు. క్రీ.శ. 1911లో నిజాం మరణించడంతో ఆయన ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఈయనే అసఫ్ జాహీ పాలకులలో చివరివాడు. ఇతడి పూర్తి పేరు ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII. ఈ నిజాం నవాబుకు 21వ ఏట ఏప్రిల్ 14, 1906లో అజం ఉన్నీసా బేగంతో వివాహమైంది. కాగా నిజాం మొదటి కుమారుడు అజంజాహి, రెండో కుమారుడు మొజాంజాహి కాగా.. ఆయనకు మొత్తం 34 మంది సంతానం.

Tags:    

Similar News