Night Curfew: నైట్ కర్ఫ్యూలో దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు
Night Curfew: కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ దొంగతనాలకు మంచి అనుకూలంగా మార్చుకున్నారు కొంతమంది.
Night Curfew: కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ దొంగతనాలకు మంచి అనుకూలంగా మార్చుకున్నారు కొంతమంది.. రాత్రి వేళల్లో ఎవ్వరూ బయటకు రాకుండా ఉండడంతో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. నగరంలోని సౌత్ జోన్ పరిధిలో స్పోర్ట్స్ బైక్స్ మీద మక్కువతో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టం. కానీ, తమ ఆర్థిక పరిస్థితితో వాటిని కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో దొంగతనాలే బెస్ట్ అనుకున్నారు. ఇంకేముంది అసలే నైట్ కర్ఫ్యూ రాత్రి వేళలో బయట ఎవరూ ఉండకపోవడంతో దొంగతనాలకు పాల్పడ్డారు. నగరంలోని సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన సందీప్, ఉత్తమ్ కుమార్ ఇద్దరూ స్నేహితులు గతంలో ఇద్దరూ ఒకే చోట పని చేశారు. స్పోర్ట్స్ బైక్స్ మీద ఇష్టంతో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.
ఇక పక్క సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని పథకం ప్రకారమే అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి 15 లక్షలు విలువ చేసే 10 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని విచారణ కోసం మీర్ పేట్ పోలీసులకు అప్పగించారు. ఏదేమైనా ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు నైట్ కర్ఫ్యూ కారణంగా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.