Night Curfew: కాసేపట్లో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలు
Night Curfew: కాసేపట్లో హైదరాబాద్ రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే వెహికల్స్‌కు బ్రేక్ పడనుంది.
Night Curfew: కాసేపట్లో హైదరాబాద్ రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే వెహికల్స్‌కు బ్రేక్ పడనుంది. నగరంలోని రోడ్లు నిర్మానుష్యంగా మారనున్నాయి. ఎక్కడ చూసినా పోలీస్ చెక్‌పోస్టులు దర్శన మివ్వనున్నాయి. రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఇవే దృశ్యాలు మనకు కనపడనున్నాయి. ఈ ఒక్కరోజే కాదు ఒక్క హైదరాబాద్‌లోనే కాదు ఈ నెల 30వ తేదీ వరకు ఇదే పరిస్థితి భాగ్యనగరంలో ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి తర్వాత వాహన రాకపోకలు ఆగిపోనున్నాయి. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ కాసేపట్లో ప్రారంభం కానుంది.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు కానుంది. కర్ఫ్యూ నుంచి ఆహార పదార్థాల పంపిణీ, పెట్రోల్ బంక్‌లు, మెడికల్ షాపులు, డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బందితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉద్యోగులకు మినహాయింపు ప్రకటించారు. అలాగే ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రభుత్వాధికారుల రాకపోకలకు మినహాయింపు ఇచ్చారు. ఇక ప్రజలు 9 తర్వాత రోడ్లపై తిరగడంపై ఆంక్షలు విధించారు. థియేటర్లు, హోటళ్లు, ప్లబ్‌లు, క్లబ్‌లు, బార్లు మూసివేయనున్నారు. ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ ఉన్నతాధికారులు.