Hyderabad: చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కొత్త ట్విస్ట్
Hyderabad: హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లిన కారు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
Hyderabad: హైదరాబాద్ హయత్‌నగర్ ఇనాంగూడ చెరువులోకి కారు దూసుకెళ్లిన కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుందామని చెరువులోకి కారును తీసుకెళ్లారు తండ్రి. కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిందని భావించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. చెరువులోకి దూకి తండ్రితో సహా ముగ్గురు పిల్లలను కాపాడారు. కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.