Air Gun Case: పటాన్‌చెరు పరిధిలో ఎయిర్‌గన్ పేలుడు ఘటనలో ట్విస్ట్
Air Gun Case: ఫామ్‌హౌస్ ఓనర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతి
Air Gun Case: పటాన్‌చెరు పరిధిలోని జిన్నారం మండలం వావిలాల ఫామ్‌హౌస్‌లో ఎయిర్‌గన్ పేలి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ గన్ పేలినట్లు భావించారు. అయితే ఆ ఇంటికి వచ్చిన టీనేజ్ యువకుడు గన్ తీసుకుని ఫైర్ చేయడంతో బుల్లెట్ దూసుకొచ్చినట్లు పోలీసులు తేల్చారు. పిల్లెట్ చిన్నారి కణితి వద్ద తగలడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.
ఫామ్‌హౌస్ యజమాని ప్రసాద్ ఆన్‌లైన్‌లో 26 వేలకు ఎయిర్‌గన్ కొనుగోలు చేశాడని పటాన్‌చెరు డీఎస్పీ భీం రెడ్డి వెల్లడించారు. ఎయిర్‌గన్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తారని దానికి లైసెన్స్ అవసరం లేదని ఆయన అన్నారు. అయితే గన్ కొనుగోలు చేసిన ప్రసాద్ దానిని నిర్లక్ష్యంగా వాచ్‌మెన్ నాగరాజు ఇంట్లో ఉంచాడన్నారు. నాగరాజు ఇంటికి బంధువులు వచ్చారని వారిలో అతని భార్య సుకన్య అక్క కుమారుడు ఎయిర్‌నగన్‌ను ఫైర్ చేశాడని చెప్పారు.