New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..!
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని వెల్లడించారు. దాదాపు 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు చెప్పారు. అంతేకాదు ఇకపై రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని డిసైడ్ అయినట్టు చెప్పారు.
రేషన్ బియ్యం తినలేక.. వాటిని బయట విక్రయించేందుకు ఎక్కువ మంది సిద్ధపడుతున్నారు. దీంతో రేషన్ బియ్యం పక్క దారి పడుతున్నాయి. అందుకే ఇక ఇప్పుడిస్తున్న రేషన్ బియ్యం స్థానంలో ఇకపై సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.