Kaushik Reddy: అసెంబ్లీలో టూరిజంపై కాదు లగచర్ల ఘటనపై చర్చించాలి
Kaushik Reddy: అసెంబ్లీలో టూరిజంపై కాదు లగచర్ల ఘటనపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) డిమాండ్ చేశారు.
Kaushik Reddy: అసెంబ్లీలో టూరిజంపై కాదు లగచర్ల ఘటనపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) డిమాండ్ చేశారు. బీఏసీలో చర్చ జరగకుండా అసెంబ్లీలో ఎజెండా ఎలా పెడతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కి ఓటు వేసినందుకు లగచర్ల వాసులకు బేడిలు వేశారని.. లగచర్ల రైతులు ఏమి తప్పు చేశారని ప్రశ్నించారు.
టూరిజం మీద చర్చ ఏముంటుందన్నారు. పదుల సార్లు సీఎం, మంత్రులు డిల్లీ(Delhi)కి వెళ్ళారు కానీ ఒక్క రూపాయి తీసుకు రాలేదని విమర్శించారు. రుణమాఫీ,రైతు భరోసా, లగచర్ల ఘటనలపైనే చర్చించాలన్నారు.