తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్
BAC Meeting: తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం సోమవారం వాకౌట్ చేశాయి.
BAC Meeting: తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం సోమవారం వాకౌట్ చేశాయి. తెలంగాణ అసెంబ్లీ టీ బ్రేక్ కోసం వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. బీఏసీ సమావేశంలో కనీసం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్,ఎంఐఎం డిమాండ్ చేశాయి. ఏయే అంశాలు సభలో చర్చిస్తారనే విషయమై ప్రభుత్వాన్ని ఈ రెండు పార్టీలు కోరాయి.
అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని బీఆర్ఎస్ చెబుతోంది. సభ ఎన్ని రోజులు నిర్వహించే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాని కారణంగానే తాము బీఏసీ నుంచి వాకౌట్ చేశామని బీఆర్ఎస్, ఎంఐఎం చెబుతున్నాయి. గంట సేపు సమావేశం నిర్వహించినా కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.