Etela Rajender: హుజూరాబాద్ మరో ఉద్యమానికి నాంది పలుకుతుంది
19 ఏళ్ల పాటు గులాబీ జెండాను మోసి.. కష్ట కాలంలో అండగా ఉన్న తనను పక్కన పెట్టడం దురదుష్టకరమన్నారు మాజీ మంత్రి ఈటల.
Etela Rajender News Today: 19 ఏళ్ల పాటు గులాబీ జెండాను మోసి.. కష్ట కాలంలో అండగా ఉన్న తనను పక్కన పెట్టడం దురదుష్టకరమన్నారు మాజీ మంత్రి ఈటల. వందల కోట్లతో బ్లాక్ మెయిల్ చేసినా ప్రజల్ని కొనలేరన్నారు. హుజూరాబాద్‌లో జరిగేది కురుక్షేత్ర యుద్ధమేనన్నారు. ధర్మానికి, అధర్మనికి జరిగే యుద్ధం ధర్మానిదే అంతిమ విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యమ ద్రోహులు ఎవరో ప్రజలకు తెలుసన్నారు. తమవారిపై అక్రమ కేసులు పెట్టి విసిగిస్తే ఖబద్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
కేసీఆర్‌కు బుద్ధిచెప్పేందుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. హుజూరాబాద్ నుంచే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తారని, అక్రమ సంపాదనతో ఓటర్లను మభ్య పెడుతున్నారన్నారు. అధికార పార్టీ నేతల కుట్రలను ఇక్కడి ప్రజలు తిప్పికొడతారన్నారు. ప్రగతి భవన్ స్క్రిప్టును చదివే వారిపై తాను మాట్లాడనని వారి చరిత్రేంటో ప్రజలకు తెలుసు అన్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి హుజూరాబాద్ వెళ్లడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. హక్కుల కోసం, నిరుద్యోగులకు కోసం పోరాటం చేస్తానని, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఎన్నిక జరగబోతుందని తెలిపారు.