Congress: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం

Congress: జిల్లాలో పార్టీ బలోపేతానికి కసరత్తు * టీఆర్‌ఎస్‌, బీజేపే లక్ష్యంగా ప్రణాళికలు

Update: 2021-06-28 08:14 GMT

కాంగ్రెస్ (ఫైల్ ఫోటో)

Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ మొదలైనట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళు నైరాశ్యంలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. పార్టీశ్రేణుల్లో సమరోత్సాహం నిపేందుకు నేతలు ప్రణాళికలు రచిస్తు్న్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలను గట్టి దెబ్బకొట్టి ప్రధాన రాజకీయశక్తిగా ఎదగాలని ఆ పార్టీ నేతలు ఉవ్విలూరుతున్నారు. మరి జిల్లాలో హస్తం పార్టీకి పూర్వవైభవం దక్కనుందా...?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. పార్టీ బలోపేతానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్‌గా నిర్మల్‌ జిల్లాకు చెందిన ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డిని నియమించింది. దీంతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వెల్లివిరుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు హస్తం నేతలు ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలలో చేరారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలహీనపడింది. ఈ టైమ్‌లో పీసీసీ పగ్గాలు రేవంత్‌ రెడ్డికి అప్పగించడంతో పాటు ఏఐసీసీ కార్యచరణ కార్యాచరణ అమలు చైర్మన్‌గా మహేశ్వర్ రెడ్డి నియమితులు కావడంతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది.

రాజకీయంగా వెనకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏఐసిసి ఈసారి ప్రకటించిన జంబో టీమ్‌లో ప్రాధాన్యత కల్పించింది. ఇది జిల్లాలో పార్టీ బలోపేతానికీ దోహదపడుతుందని కార్యకర్తులు చెబుతున్నారు. మహేశ్వర్‌‌రెడ్డికి గతంలో ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షునిగా కూడా పని చేసిన అనుభవం ఉంది.

ఇదిలా ఉంటే మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని మహేశ్వర్‌ రెడ్డి ఖండించారు. పీసీసీ తనకే వస్తుందన్నా భరోసాతో రేవంత్‌రెడ్డే... మహేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ కార్యాచరణ అమలు ఛైర్మెన్‌గా మహేశ్వర్ రెడ్డి నియమితులు కావడంతో జిల్లాలో పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News