New Health problems with corona : కరోనాతో కొత్త సమస్య

Update: 2020-08-01 04:47 GMT
కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

New Health problems with corona : విశ్వవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకో రహస్యం బయట పడుతుంది. ఇంతకు ముందు ఈ కరోనా వైరస్ ఏక రూపంలో కాకుండా ఎన్నో విధాలుగా రూపాంతరం చెందుతుందనే విషయాన్ని కనిపెట్టిన వైజ్ఞానికులు ఇప్పుడు మరో కొత్త విషయాన్ని కనిపెట్టారు. కరోనా బారిన పడిన వారిలో రక్తం గడ్డకట్టడాన్ని (పల్మనరీ థ్రాంబోసిస్‌) కొద్ది రోజుట క్రితమే గుర్తించారు. కానీ ఇప్పుడు ఈ సమస్య జఠిలమవుతుండడంతో అది వెలుగులోకి వచ్చింది. కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో వైద్యం తీసుకుంటున్న వారిలో సుమారుగా 25-30శాతం మందికి రక్తం గడ్డకడుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో బాధితుల్లో రక్త ప్రసరణ నిలిచిపోయి ఆయా అవయవాలకు రక్త అందడంలేదు. దీంతో బాధితుల అవయవాటు పనిచేయకుండా చచ్చుబడిపోతున్నాయి. ముఖ్యంగా మనిషి శరీరంలోని ప్రధాన అవయవాలు మెదడు, ఊపిరితిత్తులకు రక్తం సరిగ్గా చేరకపోవడంతో వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతున్నది.

కరోనా వైరస్ బారిన పడి వారు గత నెలలో కొన్ని ఆస్పత్రులకు చేరుకున్నారు. వారి దగ్గరికి వచ్చిన వారిలో 14 మందిలో కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం చూశామని అక్కడి వైద్యులు తెలిపారు. వారిలో ముగ్గురికి డీవీటీ ఏర్పడి సివియర్‌ కంపార్ట్‌మెంట్‌ సిండ్రోమ్‌తో ప్రాణాలు కోల్పోయారన్నారు. మరి కొంతమంది ఆలస్యంగా ఆస్పత్రులకు చేరుకోవడంవలప ఆరుగురికి కాళ్లు తీసేయాల్సి వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని శ్వాససరిగా అందకపోయినా, కాళ్లనొప్పులు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఎక్కువగా కాలి వ్యాయామాలు, ఊపిరితిత్తుల వ్యాయామాలు చేయాలని సూచించారు. ఆరోగ్యవంతుల్లోనూ రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉంటాయని, చిన్న జాగ్రత్తలతో దీనిని అధిగమించవచ్చన్నారు.

గడ్డకట్టిన రక్తం కాళ్లలోకి చేరినవారికి కాళ్లల్లో, పాదాల్లో విపరీతమైన నొప్పులు వస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా బారిన పడి ఇంట్లోనే చికిత్స పొందుతున్నవారి పాదాల్లో మంటలు వస్తే వెంటనే ఆస్పత్రులకు వెల్లి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వీరికి సకాలంలో వైద్యం అందకుంటే కాలు తీసేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాళ్లలో మంటలతోపాటు ఊపిరి రేటు నిమిషానికి 20 కన్నా తక్కువగా, ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్‌ లెవల్స్‌ 93 కన్నా తక్కువగా ఉంటే థ్రాంబోసిస్‌గా గుర్తించాలన్నారు. వైద్యులు సైతం వెంటనే రక్తం గడ్డకట్టడాన్ని నివారించే మందులు ఇవ్వాలని సూచిస్తున్నారు.




Tags:    

Similar News