Karimnagar: కరీంనగర్‌లో కొత్త అందాలు.. లైటింగ్‌తో ఆకర్షి‌స్తున్న కేబుల్ బ్రిడ్జ్

Karimnagar: ఫొటోలు దిగేందుకు పోటీపడుతున్న స్థానికులు

Update: 2023-07-01 04:55 GMT

Karimnagar: కరీంనగర్‌లో కొత్త అందాలు.. లైటింగ్‌తో ఆకర్షి‌స్తున్న కేబుల్ బ్రిడ్జ్

Karimnagar: కొత్త కట్టడాలు.....కొత్త అందాలు...మారిన వాతావరణంలో కరీంనగర్ వాసులను అలరిస్తున్నాయి.లోయర్ మానేరు తప్ప మరే పర్యటక ప్రాంతం లేని కరీంనగర్ లో ఇప్పుడు నిర్మాణాలు జరిగిన కట్టడాలు అందరిని ఆకర్షిస్తున్నాయి...ఫ్యామిలి తో సహా సరదగా ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ లో గడిపేస్తున్నారు నగర వాసులు.

కరీంనగర్ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో ఒకటి. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో నిర్మాణమైన నూతన కట్టడాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి..రాబోయే రోజుల్లో నగరంలో మరిన్ని కొత్త పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవడంతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం నగరంలో అత్యంత ఎక్కువగా ఆకర్షిస్తున్న ప్రాంతం కేబుల్ బ్రిడ్జ్. హైదరబాద్ దుర్గం చెరువు మీద నిర్మించినట్టుగానే కరీంనగర్ మానేరు నది పై ఈ కేబుల్ బ్రిడ్జ్ ని నిర్మించింది ప్రభుత్వం. ఇటీవల మంత్రి కేటియార్ చేతులు మీదుగా ప్రారంభించారు.

ఇన్ని రోజులుగా ఎండలతో అల్లాడిన జనం..ఇప్పుడు చల్లబడిన వాతావరణం లో కుటుంబంతో సహా ఇలాంటి ప్రాంతాలకు వచ్చి రిలాక్స్ అవుతున్నారు...నైరుతి రుతుపవనాలు జిల్లా అంతటా వ్యాపించడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో ఈ కొత్త కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక కేబుల్ బ్రిడ్జ్ మాత్రమే కాదు..అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త ఐలాండ్స్ కూడా స్దానికులను ఆకర్షిస్తున్నాయి.వినూత్నంగా ఉన్న ఐలాండ్స్ లో కూడా ఫోటోలు దిగేందుకు పోటీపడుతున్నారు స్దానికులు..

ఇక రాత్రులు ఇదే కేబుల్ బ్రిడ్జ్ డైనమిక్ లైటింగ్‌తో మరింతగా ఆకర్షిస్తోంది. గత ఆరునెలల క్రితం వరకు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే రహాదారి దుర్గందంతో ఉండేది..కానీ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం తో ఈ ప్రాంతమంతా ఇప్పుడు కొత్త వాతవారణాన్ని సంతరించుకుంది..అందుకే ఇన్ని రోజులుగా అటువైపుగా వెళ్లేందుకు ఇబ్బంది పడిన నగరవాసులు..ఇప్పుడు కుటుంబాలతో సహా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు...ఇక ఇదే కేబుల్ బ్రిడ్జ్ కింద నిర్మాణం అవుతున్న మానేరు రివర్ ఫ్రంట్ కూడా రాబోయే రోజుల్లో ఒక పెద్ద పర్యటక ప్రాంతంగా మారనుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మానేరు రివర్ ఫ్రంట్ వచ్చే ఏడాదికల్ల ఒకరూపుకి వచ్చే అవకాశముంది.

కరీంనగర్ లో మరిన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా నిర్మాణమవుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న శ్రీవారి ఆలయం ఇప్పటికే శంకుస్థాపన పనులు పూర్తి చేసుకుంది. ఆలయ నిర్మాణం ఏడాదిన్నరలో పూర్తి చేస్తామంటూ టీటీడీ ప్రకటించింది..సో ఈ ప్రాంతం కూడా ఒక కొత్త డివోషనల్ లుక్‌ని కరీంనగర్ కి అందివ్వనుంది...ఇక ఇస్కాన్ టెంపుల్ కూడా కరీంనగర్ లో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇలా కొత్తగా కడుతున్న నిర్మాణాలు కరీంనగర్ కి న్యూ లుక్ ని తీసుకొచ్చాయి.

Tags:    

Similar News