టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆటఆడుకుంటున్న నెటిజన్లు

Guvvala Balaraju: ఎమ్మెల్యే పదవికి గువ్వల బాలరాజు రాజీనామా చేయాలంటూ డిమాండ్‌

Update: 2021-11-12 15:59 GMT

గువ్వల బాలరాజు (ఫైల్ ఇమేజ్)

Guvvala Balaraju: టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రస్తుతం ఈ పేరు సోషల్‌ మీడియాలో మారు మ్రోగుతోంది. హుజూరాబాద్‌లో బీజేపీ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న గువ్వల బాలరాజు రాజీనామా చేయకపోవడంతో ఆ‍యనను సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఓ ఆటఆడుకుంటున్నారు. ఎన్నికలకు ముందు గాంభీర్యాన్ని ప్రదర్శించిన గువ్వల టీఆర్‌ఎస్‌ ఓటమితో ఇరుకున పడ్డారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా అధిష్టానం పిలుపుతో రైతుల ధర్నాలో పాల్గొంటే ఆయన మాత్రం సోషల్‌ మీడియా ధాటికి సొంత నియోజకవర్గంలోనే పాల్గొనలేకపోయారు

Tags:    

Similar News