Nandamuri Balakrishna: సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ!

Nandamuri Balakrishna: ఈ ఏడాది తెలంగాణలో పదో తరగతి పాఠ్యాంశంలో దివంగత నటుడు, నేత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను చేర్చిన విషయం తెలిసిందే.

Update: 2020-09-04 14:27 GMT

Balakrishna (File Photo)

Nandamuri Balakrishna: ఈ ఏడాది తెలంగాణలో పదో తరగతి పాఠ్యాంశంలో దివంగత నటుడు, నేత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను చేర్చిన విషయం తెలిసిందే.. కొత్తగా రూపొందించిన సిలబస్‌లో పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 268 పేజీలో ఎన్టీఆర్ కి సంబంధించిన జీవిత విశేషాలను అందులో పొందుపరిచారు. దీనితో తెలంగాణ ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ నేతలు ధన్యవాదాలు తెలిపారు..

అందులో భాగంగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. " కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు" అంటూ బాలకృష్ణ పోస్ట్ చేశారు.

పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 268 పేజీలో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ హయాంలో తీసుకొచ్చిన పథకాలను అందులో ప్రస్తావించారు. కిలో బియ్యం రూ.2లకే, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు చేపట్టారని అందులో వివరించారు.

సినీ నటుడుగా ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న ఎన్టీఆర్... ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తన పాలనతో ప్రజలను మెప్పించారు.. మొత్తం మూడు సార్లు అయన ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. 




Tags:    

Similar News