Gangavva: ఆళ్లు అనమంటేనే అన్నా.. నన్ను క్షమించండి సారూ.. చంద్రబాబుకు గంగవ్వ అభ్యర్థన..

Gangavva: తప్పుగా అనుకోవద్దు సార్.. చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన గంగవ్వ.. ఎందుకంటే..

Update: 2023-05-24 10:06 GMT

Gangavva: ఆళ్లు అనమంటేనే అన్నా.. నన్ను క్షమించండి సారూ.. చంద్రబాబుకు గంగవ్వ అభ్యర్థన

Gangavva: గంగవ్వ... తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది..స్వచ్చమైన పల్లెటూరి మట్టి మనిషిలా..పక్కింటి పెద్దవ్వగా ఎందరో అభిమానులను గంగవ్వ సొంతం చేసుకున్నారు. మై విలేజ్ షోతో క్రేజ్ సాధించడమే కాదు బిగ్ బాస్ హౌస్ లో కూడా గంగవ్వ అడుగుపెట్టిందంటే ఆమెకు ఏపాటి పాపులారీటీ వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. గంగవ్వ క్రేజ్ గురించి కాస్త పక్కనపెడితే తాజాగా గంగవ్వ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి క్షమాపణలు చెప్పింది.

గంగవ్వ మాటలతో చంద్రబాబు పై ట్రోలింగ్

ఈ ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక టీవీ ఛానల్ వారు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగవ్వ పాల్గొంది. షో లో భాగంగా ఛానల్ వారు సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలను గంగవ్వతో చెప్పించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, లోకేష్ ఫోటోలను చూపించగా... వాటిని చూసి జాతకం చెప్పనంటూ షో నుంచి అర్థాంతరంగా లేచి గంగవ్వ వెళ్లిపోతుంది. కానీ, సదరు ఛానల్ వాళ్లు మళ్లీ మళ్లీ అడగగా..చంద్రబాబుకు గ్రహణం పట్టిందని గంగవ్వ చెబుతుంది. నాటి వీడియోని కొంతమంది ఎడిట్ చేసి చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు.

చంద్రబాబుకు క్షమాపణ

తాజాగా ఈ వీడియోపై గంగవ్వ స్పందించింది. చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలపై బాధపడుతున్నానంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది. సదరు ఛానల్ వారు చెప్పమంటేనే చెప్పానని తన మాటలు ఇబ్బంది పెట్టిఉంటే క్షమించాలని చంద్రబాబును గంగవ్వ కోరింది. ''మీ అందరి వల్లే నాకు ఇంత గూడు అయింది. నేను మాట జారితే క్షమించండయ్యా'' అంటూ గంగవ్వ తీవ్ర భావోద్వేగానికి గురైంది. గంగవ్వ క్షమాపణలు చెప్పిన వీడియోను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభిమానులు వైరల్ చేస్తున్నారు. 


Tags:    

Similar News