ఆదిలాబాద్ లో మునిసిపల్ కౌన్సిలర్ కొడుకు వీరంగం.. విచక్షణరహితంగా దాడి...

Adilabad: గొడవకు వివాహేతర సంబంధం కారణమని గుర్తించిన పోలీసులు

Update: 2022-05-03 09:25 GMT

ఆదిలాబాద్ లో మునిసిపల్ కౌన్సిలర్ కొడుకు వీరంగం.. విచక్షణరహితంగా దాడి...

Adilabad: ఆదిలాబాద్ లో మునిసిపల్ కౌన్సిలర్ కొడుకు వీరంగం సృష్టించాడు... 8 వార్డు కౌన్సిలర్ అంజిబాయి కొడుకు ఆనంద్ తన అనుచరులతో కలిసి ప్రత్యర్థి యువకులపై పిడిగుద్దులు కురిపించారు. యువకులు భయపడి పారిపోతున్నా పట్టుకుని విచక్షణారహితంగా దాడిచేశారు. పశువును బాదినట్లుగా ఇష్టారాజ్యంగా దాడి చేశారు... దాడిలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.. ఈ దాడి పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.. దాడికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇరువర్గాల నడుమ గొడవ వివాహేతర సంబంధ విషయంలో తలెత్తిన వివాదమని పోలీసుల విచారణలో వెల్లడైంది. కెఆర్కే కాలనీలో వార్డు కౌన్సిలర్ కుమారుడు వ్యక్తిగత గొడవను సామాజిక గొడవగా చిత్రీకరించాడని పోలీసులు గుర్తించాడు. కాలనీ పరిసరాల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోనీకుండా... ముందస్తు జాగ్రత్తగా పోలీసుల బందోబస్తు ఏర్పాటుచేశారు.

Tags:    

Similar News