Thummala Nageswara Rao: కేసీఆర్‌ ఆదేశాలతో తుమ్మలకు బుజ్జగింపులు

Thummala Nageswara Rao: తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామా నాగేశ్వరావు భేటీ అయ్యారు.

Update: 2023-08-23 10:21 GMT

Thummala Nageswara Rao: కేసీఆర్‌ ఆదేశాలతో తుమ్మలకు బుజ్జగింపులు

Thummala Nageswara Rao: తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామా నాగేశ్వరావు భేటీ అయ్యారు. కేసీఆర్ ఆదేశాలతో తుమ్మలతో నామా బేటీ జరిగింది. తుమ్మలతో గంటకు పైగా చర్చలు నామా చర్చలు జరిపారు. నామాతో కలిసి తుమ్మల ఇంటికి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు వెళ్లారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుమ్మల టికెట్‌ ఆశించారు. అయితే ఆ టికెట్‌ను కందాల ఉపేందర్‌రెడ్డికి కేటాయించింది అధిష్టానం. దీంతో తుమ్మల అనుచరులు అసమ్మతి గళం లేవనెత్తారు. నిన్నంతా సమావేశమై పార్టీ నుంచి బయటకు రావాలంటూ తుమ్మలకు సూచించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తుమ్మల సైతం టికెట్‌ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ వైపు ఆయన చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తుమ్మలతో చర్చించాలని నామా నాగేశ్వరరావును ఆదేశించారు.

Tags:    

Similar News