కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్టులు కాదు.. నిజమైన తెలంగాణ ఉద్యమ కారులు

*లాఠీ దెబ్బలు తిని, రబ్బురు బుల్లెట్లకు ఎదురెళ్లింది తామే- కోమటిరెడ్డి

Update: 2022-10-11 12:45 GMT

కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్టులు కాదు.. నిజమైన తెలంగాణ ఉద్యమ కారులు

Komatireddy Venkat Reddy: కోమటి బ్రదర్స్ కోవర్టులంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పబట్టారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రబ్బరు బుల్లెట్లు, లాఠీ దెబ్బలు తిన్న తాము కోవర్టులమా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అంటేనే కమీషన్లకు కేరాప్ అడ్రస్ అన్న కోమటిరెడ్డి ఇకపై నోటికొచ్చినట్లు మాట్లాడితే మీ కుటుంబ సభ్యుల అవినీతి చిట్టా విప్పుతామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. తెలంగాణ కోసం పదవులు సైతం తృణప్రాయంగా వదులుకున్న చరిత్ర తమదని గుర్తు చేశారు.

Tags:    

Similar News