బీఆర్ఎస్ భారత మ్యాప్‌ను మార్చిందన్న ఎంపీ అరవింద్
*పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను మ్యాప్ నుంచి తీసేసారని వ్యాఖ్య
Dharmapuri Arvind: కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ భారత మ్యాప్‌ను మార్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. పాక్ ఆక్రమిత కాశ్మీరును మ్యాప్ నుంచి తీసేసారని మండిపడ్డారు. జాతీయ రాజకీయాల్లో ఎప్పటికీ కేసీఆర్ రాణించలేరని వ్యాఖ్యానించారు. ఇది ఆ పార్టీ పేరు మార్పు మాత్రమే అన్నారు. ఇందూరుకు సంబందించి కవితను బీఆర్ఎస్‌లో యాక్టివ్ చేయాలన్నారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీల మద్యే పోటీ ఉంటుందని గెలుపు బీజేపిదేనన్నారు.