Dharmapuri Arvind: పసుపు రైతుల మొహాల్లో ఇప్పుడిప్పుడే ఆనందం కనిపిస్తోంది
Dharmapuri Arvind: రానున్న రోజుల్లో మద్దతు ధర రికార్డును మేమే తిరగరాస్తాం
Dharmapuri Arvind: దేశంలో పసుపు రైతుల మొహాల్లో ఇప్పుడిప్పుడే ఆనందం కనబడుతుందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో అంకుశాపూర్ చెందిన రాజు అనే రైతు పండించిన పసుపుు 17 వేల 503 రూపాయలు, అదే గ్రామానికి మహేష్ అనే రైతుకు అదే మార్కెట్‌లో 18 వేల 900 రూపాయల ధర పలకడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గతంలో లేని విధంగా పసుపు ధరలు మార్కెట్‌లో ఉండడంపై ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. క్వింటాలు పసుపుకు 20 వేల రూపాయలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు అర్వింద్ వివరించారు.
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద నిజామాబాద్ జిల్లాకు పసుపును ఎంపిక చేయడం, రాష్ట్రానికి పసుపు బోర్డు మంజూరు చేయడం వల్ల పసుపుకు మంచి ధర లభిస్తుందన్నారు. రానున్న రోజుల్లో పసుపు మద్దతు ధరపై తమ రికార్డుకు తామే తిరగరాస్తామన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్.