Motkupalli Narasimhulu: మోత్కుపల్లి కారెక్కేస్తారా?
Motkupalli Narasimhulu: తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
Motkupalli Narasimhulu: తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల సమావేశానికి సైతం హాజరయ్యారు. పార్టీ నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోత్కుపల్లి ప్రగతి భవన్‌కు వెళ్లటంపై పార్టీ ఫైర్ అయిందని తెలుస్తోంది. దీంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు మోత్కుపల్లి ప్రకటించారు. దీంతో ఆయన కారు పార్టీలో చేరుతారననే వార్తలు టీఆర్ఎస్ వర్గాల్లో గుప్పుమంటున్నాయి.
బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమల పార్టీకి రాజీనామా చేశారు. దాంతో ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మనస్థాపానికి గుయ్యానని, దళిత ఎంపవర్‌మెంట్ మీటింగ్‌కి పోతే వివాదం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈటల చేరిక విషయంలో విభేదించిన మోత్కుపల్లి పార్టీలో దళితులకు భాగస్వామ్యం లేదని ఆరోపించారు. బీజేపీకి రాజీనామా చేయడంతో టీఆర్ఎస్ చేరిక ఇక లాంచనమే అనే వార్తలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి బీజేపీ వద్దన్న మోత్కుపల్లి హాజరయ్యారు. కేసీఆర్ కొత్తగా తీసుకొచ్చిన దళిత సాధికారత పథకం దళిత బంధుకు మద్దతుగా మాట్లాడారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు మోత్కుపల్లిపై గుర్రుగా ఉన్నారు. బీజేపీ నేతలకు మోత్కుపల్లి మధ్య ఈ వ్యవహారం చిచ్చు పెట్టింది. దాంతో పార్టీ నేతలు ఆయన్ను దూరం పెట్టారు. ఈక్రమంలోనే కాషాయ పార్టీపై మోత్కుపల్లి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
దళిత సమావేశానికి హాజరైన మోత్కుపల్లి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించడంతో ఆయన కారు ఎక్కుతారనేది కన్ఫాం అయింది. మరోవైపు ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకున్నప్పుడు తనకు ఒక్కమాట కూడా అడగకపోవడం ఇబ్బందికి గురిచేసిందన్నారు. సీఎం కేసీఆర్ మీద విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు ఆయన. ఇన్నాళ్లు ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీలో చేర్చుకున్న కాషాయ పార్టీ ఇప్పుడు తమ పార్టీ నుంచి వెళ్లిపోవడం డిఫెన్స్ లో పడింది.
ఈటల రాజేందర్‌ను పార్టీలో చేరుకుని సక్సెస్ అయిన బీజేపీ ఇప్పుడు మోత్కుపల్లి వ్యవహారంతో డిఫెన్స్ లో పడింది. బీజేపీ తరుపున తాను వెళ్లి మంచి పనిచేశానని లేకుంటే బీజేపీపై యాంటీ దళిత ముద్రపడేదని మోత్కుపలి అనడంతో ఆయనపై కమలదళం జీర్ణించుకోవడం లేదట అందుకే ఆ పార్టీని వీడారు. మరి చూడాలి సైకిల్ దిగి కమలం పట్టుకున్న మోత్కుపల్లి ఇప్పుడు కమలాన్ని పడేసి కారు ఎక్కుతారో లేదో.