కొత్త పార్టీ నిర్మాణంలో వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఇప్పటికే పార్టీ సలహాదారులుగా మాజీ ఐఏఎస్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయ కుమార్ సిన్హాలు నియమించిన షర్మిల.. మాస్టర్ మోటివేటర్ బ్రదర్ షఫీని తన పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఆహ్వానం మేరకు బ్రదర్ షఫీ ఇవాళ లోటస్ పాండ్‌కు రానున్నట్లు సమాచారం. యూత్‌లో బ్రదర్ షఫీకి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో యువతను ఆకర్షిందుకే షఫీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. వేలాది మందిని ప్రభావితం చేసేలా ప్రసంగించగల షఫీ షర్మిల పార్టీకి తప్పకుండా బలమైన వ్యక్తి కాగలరని షర్మిల అభిమానులు విశ్వసిస్తున్నారు.