Telangana: తెలంగాణలో మొత్తం 20,459 మంది వీఆర్‌ఏలు.. సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించిన సబ్ కమిటీ

Telangana: వీఆర్‌ఏల సర్దుబాటుపై భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ

Update: 2023-07-13 06:19 GMT

Telangana: తెలంగాణలో మొత్తం 20,459 మంది వీఆర్‌ఏలు.. సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించిన సబ్ కమిటీ

Telangana: తెలంగాణలోని వీఆర్‌ఏలను ఏ ఏ శాఖల్లో భర్తీ చేయనున్నారు.. రాష్ట్రంలో ఎంతమంది వీఆర్‌ఏలు ఉన్నారు.. వారి విద్యార్హతలు ఏమిటి..? వారిని ఏ శాఖలో భర్తీ చేయాలి.. రెవెన్యూ శాఖలో మదింపు చేయాలని కోరుతున్న ఉద్యోగుల నుంచి కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటి.....? వీళ్ల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని టాక్...

తెలంగాణలో 20,459 మంది వీఆర్‌ఏలు ఉన్నారు.. ఇందులో చదువుకున్న వారితో పాటు చదువుకోని వారూ ఉన్నారు.. జిల్లాల నుంచి CCLA కు చేరిన వీఆర్‌ఏల డిటెయిల్స్.. మొత్తం వీఆర్‌ఏల్లో 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారు 4వేలకు పైగా ఉన్నారు. చదువుకోని వారు 3 వేల 300లకు పైగా ఉన్నారు. డిగ్రీ... ఆ పైన చదివిన వారు 3 వేల 600 మంది, ఇంటర్మీడియట్ 2 వేల 700లకు పైగా, పదో తరగతి చదివిన వారు 3 వేల 600లకు పైగా ఉన్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి మధ్యలో 2 వేల మందికి పైగా, ఒకటో తరగతి నుంచి ఆరో తరగతికి పైగా చదివిన వారు వెయ్యి మంది ఉన్నారు..

వీఆర్‌ఏలుగా ఉన్న వారిని అవసరం ఉన్న చోట వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పిన క్రమంలోనే కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది.. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీలో మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఉన్నారు.. ఈ సబ్ కమిటీ వీఆర్‌ఏల అభిప్రాయాన్ని తీసుకుంది.. రాష్ట్ర ప్రభుత్వంలో మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఖాళీలు ఉన్నాయని తెలిపింది సబ్ కమిటీ.. అయితే సబ్ కమిటీ ముందు వీఆర్‌ఏలు కొన్ని డిమాండ్లు ఉంచారు.. క్లాస్ ఫోర్ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే పే స్కేల్ ఇస్తామని తెలపడంతో వీఆర్‌ఏలు అభ్యంతరం తెలిపారు.. జూనియర్ అసిస్టెంట్లకు ఇస్తోన్న పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్‌ఏలలో చాలా మంది విశేష అనుభవం ఉన్న వారని, కాబట్టి ఎక్కడా నష్టపోకుండా చూడాలని కేబీనెట్ సబ్ కమిటీని కోరారు..

దాదాపు మూడు గంటల పాటు జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలోలో వీఆర్ఏల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది సబ్ కమిటీ.. వీఆర్ఏలు అడుగుతున్న విధంగా పే స్కేలు ఇవ్వడంపై మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది.. ఆ తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక అందించనుంది. ఆ నివేదికలో ఏ శాఖలో సర్దుబాటు చేయనున్నారనే నిపై క్లారిటీ ఇవ్వనుంది క్యాబినెట్ సబ్ కమిటీ.... 

Tags:    

Similar News