Harish Rao: సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజి ఆధునీకరణ
Harish Rao: కళాశాల భవనం,సింథటిక్ ట్రాక్,బాస్కెట్ బాల్, ప్లే గ్రౌండ్ ప్రారంభించిన హరీశ్ రావు
Harish Rao: రాష్ట్రంలో విడతలవారీగా ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు బడి కింద అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. 60 ఏళ్లలో 400 జూనియర్ కాలేజీలో ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 1300కు పెంచామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోనే సిద్దిపేట అన్నింటా అగ్రభాగాన ఉందన్నారు. విద్యార్థులకు 25 శాతం మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని మంత్రి తెలిపారు. విద్యార్థులతో మంత్రి హరీష్ రావు సరదాగా ముచ్చటించారు.
సిద్దిపేట జిల్లాకేంద్రం ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజి ఆధునీకరణ చేసిన కళాశాల భవనం,సింథటిక్ ట్రాక్,బాస్కెట్ బాల్, ప్లే గ్రౌండ్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.రూ 5 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని హరీష్ రావు పేర్కొన్నారు.10/10 GPA సాధించిన విద్యార్థులకు ఐప్యాడ్ అందించనున్నట్లు మంత్రి తెలిపారు.జిల్లా లో 80 ఉన్నత పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, పిల్లలు పోటీలు పడి ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారని మంత్రి తెలిపారు. శుభ్రతకు మారుపేరు సిద్దిపేట అని, పట్టణంలో ఎక్కడ రోడ్ల పైన చెత్త వేయవద్దని మంత్రి సూచించారు.