ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత.. ఈనెల 23 వరకు రిమాండ్ విధించిన ఢిల్లీ కోర్టు
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈనెల 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది ధర్మాసనం. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈరోజు ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున ఎన్.కె మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు.