MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన ఈడీ.. మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత ప్రెస్‌మీట్
MLC Kavitha: ఈనెల 11న ఈడీ విచారణకు హాజరుకానున్న కవిత
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా పొలిటికల్‌గా పెను ప్రకంపనలు సృష్టించింది. తాజాగా ఈడీ... ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో తాను 11వ తేదీన విచారణకు హాజరు కానున్నట్టు ఈడీని కోరుతూ లేఖ రాశారు. అయితే, కవిత లేఖపై ఈడీ.. స్పందించింది. కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 11వతేదీన విచారణకు హాజరు కావాలని తెలిపింది. దీంతో, ఈడీ విచారణపై ఉత్కంఠకు తెరపడింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు.
ఇక లిక్కర్ స్కాం కేసులోభాగంగా అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబులతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. కవిత ముందస్తు బెయిల్ కోసం బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.