MLC Kavitha: రేపు తీహార్ జైలు నుంచి కోర్టుకు కవిత
MLC Kavitha: ఉ.10:30 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టనున్న CBI
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసింది. తీహార్ జైలులో ఉన్న కవితను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టానున్నారు. కవితను వారం పాటు సీబీఐ కస్టడీకి కోరనుంది. ఇటీవలే కవితను జైలులో సీబీఐ విచారించింది. కేజ్రీవాల్‌తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ అభియోగాలు మోపింది. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌పై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు. 100 కోట్ల ముడుపులు చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూ దస్త్రాలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. సౌత్ గ్రూప్, ఆప్ మధ్య కవిత దళారిగా వ్యవహరించి 100 కోట్ల చెల్లింపులో కీలకపాత్ర పోషించారని సీబీఐ పేర్కొంది. ఐపీసీ120B కింద కుట్ర కోణంలోనూ సీబీఐ దర్యాప్తు చేపట్టింది.