చదువుల తల్లి హారికకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత.. ఎంబీబీఎస్‌కు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ..

MLC Kavitha: యూట్యూబ్‌లో క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా నాందేవ్ గూడకు చెందిన హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు.

Update: 2022-11-09 10:31 GMT

చదువుల తల్లి హారికకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత.. ఎంబీబీఎస్‌కు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ..

MLC Kavitha: యూట్యూబ్‌లో క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా నాందేవ్ గూడకు చెందిన హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. hmtv లో ప్రసారమైన కథానాలకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఐదేళ్ల ఎంబీబీఎస్‌కు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. మొదటి సంవత్సరం ఫీజును చెక్కు రూపంలో అందజేశారు. చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని కవిత అన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించిందని అభినందించారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని తెలిపారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. హారిక ఎంబీబీఎస్‌ చదువులో రాణించి , వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.


Tags:    

Similar News